భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు | Ayonika shoots bronze as India add to medal count | Sakshi
Sakshi News home page

భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు

Published Mon, Sep 28 2015 8:33 PM | Last Updated on Sun, Sep 3 2017 10:08 AM

Ayonika shoots bronze as India add to medal count

న్యూఢిల్లీ: ఏషియన్ ఎయిర్ గన్ చాంపియన్ షిప్ లో భాగంగా ఇక్కడ సోమవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో భారత్ కు చెందిన అయోనికా పౌల్ కాంస్య పతకాన్ని సాధించింది.  భారత స్టార్ షూటర్ అపూర్వి చండీలా పతకం సాధించడంలో విఫలమైనా. . అయోనికా 185.0 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఇదే విభాగంలో సింగపూర్ కు చెందిన సెర్ జియాన్ 208 పాయింట్లతో స్వర్ణాన్ని సాధించింది.  ఇదిలా ఉండగా మహిళల 10 మీటర్ల జూనియర్ల విభాగంలో భారత షూటర్ శ్రీయాంక సదాంగి కాంస్యాన్ని సాధించింది.


ఆదివారం జరిగిన 10మీటర్ల పురుషుల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో భారత స్టార్ షూటర్ అభినవ్ బింద్రా రెండు పసిడి పతకాలు సాధించాడు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన బింద్రా..  గగన్ నారంగ్, చెయిన్ సింగ్‌లతో కూడిన భారత బృందం టీమ్ విభాగంలో కూడా పసిడిని సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement