పాక్ వన్డే కెప్టెన్ అరుదైన ఘనత
అబుధాబి: వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో పాకిస్తాన్ కెప్టెన్ అజహర్ అలీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. విండీస్ తో ఇక్కడ జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో అజహర్ అలీ సెంచరీ(109 బంతుల్లో 101 పరుగులు : 8x4 1x6) సాధించాడు. ఇన్నింగ్స్ 38వ ఓవర్లో విండీస్ బౌలర్ బెన్ బంతిని డీప్ పాయింట్ వైపు కొట్టి మూడు పరుగులు తీయడంతో అరుదైన ఫీట్ నెలకొల్పాడు.
పాకిస్తాన్, కెప్టెన్ గా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా అజహర్ అలీ(3) నిలిచాడు. గతంలో ఈ ఫీట్ ఇంజమామ్ ఉల్ హక్(2), షాహిద్ అఫ్రిది(2) పేరిట సంయుక్తంగా ఉండేది. అయితే 39వ ఓవర్లో విండీస్ బౌలర్ జాసన్ హోల్డర్ ఓ తెలివైన బంతితో అజహర్ ను బొల్తా కొట్టించాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన షోయబ్ మాలిక్ (5)ను సునీల్ నరైన్ ఔట్ చేసి మూడో వికెట్ గా వెనక్కిపంపాడు. 40ఓవర్లు ముగిసేసరికి పాక్ 3 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది.