వరల్డ్ టీ 20: నెదర్లాండ్ విజయలక్ష్యం 154 | bangladesh set target 154 run for Netherlands | Sakshi
Sakshi News home page

వరల్డ్ టీ 20: నెదర్లాండ్ విజయలక్ష్యం 154

Published Wed, Mar 9 2016 4:48 PM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM

వరల్డ్ టీ 20: నెదర్లాండ్ విజయలక్ష్యం 154

వరల్డ్ టీ 20: నెదర్లాండ్ విజయలక్ష్యం 154

ధర్మశాల: వరల్డ్ టీ-20లో భాగంగా బుధవారం హిమచలప్రదేశ్ ధర్మశాల స్టేడియంలో నెదర్లాండ్తో జరుగుతున్న క్వాలిఫయింగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. దాంతో నెదర్లాండ్ జట్టుకు 154 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.

టాస్ గెలిచిన నెదర్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన బంగ్లా ఓపెనర్ సౌమ్య సర్కార్ 15 పరుగులకే వెనుతిరిగాడు. మరో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ వరుస వికెట్లు కోల్పోతున్న ధీటుగా ఆడుతూ 58 బంతుల్లో 83 (3 సిక్సర్లు, 6 ఫోర్లు) పరుగులు చేసి నాట్‌ ఔట్‌గా నిలిచాడు.  

షబ్బీర్ రెహ్మన్ 15 పరుగులు, మహ్మదుల్లా 10 పరుగులు చేయగా మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. కాగా, నెదర్లాండ్ బౌలర్లు వేన్ డెర్ గుగ్టెన్ మూడు వికెట్లు, వాన్ మీకెరెన్ రెండు వికెట్లు తీయగా మెర్వీ, బోర్రెన్ తలో వికెట్‌ తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement