న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్‌ను చూసేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ సారథి, ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ భారత్‌కు వస్తానంటే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) వద్దని చెప్పిందట. ఇటీవల కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. దాంతో అతడిపై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) 12 నెలల పాటు నిషేధం విధించింది. అదే సమయంలో ఈ ఏడాది ఐపీఎల్‌కు సైతం వార‍్నర్ దూరం కావాల్సి వచ్చింది.
కాగా, కొద్ది రోజుల క్రితం వార్నర్.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ ఆడే ఏదో ఒక మ్యాచ్ ప్రత్యక్షంగా చూసేందుకు తప్పకుండా భారత్ వస్తానని చెప్పాడు. ఈ క్రమంలోనే అతని భార్య క్యాండైస్.. వార్నర్ భారత్‌కు వచ్చే అంశంపై బీసీసీఐ అనుమతి కోరిందట. దీనికి బీసీసీఐ నుంచి గ్రీన్ సిగ‍్నల్ రాలేదట. ‘ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచ్‌లను చూసేందుకు వార్నర్ భారత్‌కు రావాలని ఆరాటపడ్డాడు. కానీ, బీసీసీఐ నుంచి అనుమతి రాలేదు. వచ్చే ఏడాది అతను తప్పకుండా వస్తాడు. అతనెంతో ఇష్టపడే జట్టును స్వయంగా కలిసి మద్దతిచ్చేందుకు కుదరడం లేదని వార్నర్ ఎంతో బాధపడుతున్నాడు’ అని వార్నర్ భార్య క్యాండైస్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment