భువీకి మంచి భవిష్యత్తు | Bhuvneshwar Kumar have good carrer | Sakshi
Sakshi News home page

భువీకి మంచి భవిష్యత్తు

Published Sun, May 25 2014 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM

భువీకి మంచి భవిష్యత్తు

భువీకి మంచి భవిష్యత్తు

కోల్‌కతా: భారత పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు భవిష్యత్తులో మంచి టెస్టు బౌలర్‌గా ఎదిగే సత్తా ఉందని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ అభిప్రాయ పడ్డాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో తన సహచరుడైన భువనేశ్వర్‌పై అతను ప్రశంసలు కురిపించాడు. త్వరలో జరిగే ఇంగ్లండ్ సిరీస్‌లో అతను కీలకమవుతాడని వార్నర్ అన్నాడు. ‘భువనేశ్వర్ అసలైన స్వింగ్ బౌలర్.

ఇంగ్లండ్ జట్టుకు అండర్సన్ తరహాలో అతను టీమిండియాకు ఉపయోగపడతాడు. చాలా సందర్భాల్లో బ్యాట్స్‌మెన్ అతడిని ఎదుర్కోలేకపోతున్నారు. ఇటీవల అతని వేగం కూడా పెరిగింది. కాస్త ఎత్తు ఉంటే అత్యుత్తమంగా నిలిచేవాడు. అయితే ఇంగ్లండ్ వికెట్లపై భువీ అద్భుతాలు చేయగలడు’ అని వార్నర్ విశ్లేషించాడు. తొలి సీజన్‌లో సన్‌రైజర్స్ ఆటగాళ్ల సాహచర్యం చాలా సంతృప్తినిచ్చిందని వార్నర్ చెప్పాడు. ‘శిఖర్‌తో నాకు బాగా దోస్తీ కుదిరింది. ప్రపంచ క్రికెట్‌లో ఎంతో సాధించినా ఒదిగి ఉండే గొప్ప వ్యక్తిత్వం ఉన్న లక్ష్మణ్‌తో చాలా నేర్చుకున్నాను. ఇదో మంచి అనుభవం’ అని అతను గుర్తు చేసుకున్నాడు. క్యాండీస్ ఫాల్జన్‌తో సహజీవనం చేస్తున్న వార్నర్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఆ తర్వాత తాము పెళ్లి చేసుకుంటామని అతను వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement