సిడ్నీ: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇక‍్కడ జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ 303 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. జాస్ బట్లర్(100 నాటౌట్; 83 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ శతకం సాధించడంతో పాటు క్రిస్ వోక్స్(53 నాటౌట్; 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో ఇంగ్లండ్ మూడొందలకు పైగా స్కోరును నమోదు చేసింది. ఈ ఇద్దరూ 113 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసి ఇంగ్లండ్ భారీ స్కోరు చేయడంలో సహకరించారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 107 పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లను కోల్పోయింది. జాసన్ రాయ్(19), హేల్స్(1), బెయిర్ స్టో(39), జో రూట్(27) వికెట్లను నష్టపోయింది. ఆ తరుణంలో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్-బట్లర్‌లు మరమ్మత్తులు చేపట్టారు. అయితే మోర్గాన్(41) ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరిన తర్వాత వోక్స్-బట్లర్ జోడి సమయోచితంగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే ముందుగా వోక్స్ హాఫ్ సెంచరీ సాధించగా, బట్లర్ సెంచరీ నమోదు చేశాడు. దాంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. ఇప్పటికే వరుసగా రెండు వన్డేలు గెలిచిన ఇంగ్లండ్ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment