మెల్బోర్న్: దేశవాళీ మ్యాచ్ సందర్భంగా గాయపడి ఆకస్మికంగా మరణించిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్కు ప్రపంచ కప్ను అంకితం చేశారు. ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్పై విజయానంతరం ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్.. కప్ను హ్యూస్కు అంకితమిచ్చారు. బౌన్సర్ తలకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డ హ్యూస్ గతేడాది నవంబర్ 27న మరణించాడు.