వొజ్నియాకి శుభారంభం | Caroline Wozniacki reaches US Open second round | Sakshi
Sakshi News home page

వొజ్నియాకి శుభారంభం

Published Tue, Aug 30 2016 1:01 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

వొజ్నియాకి శుభారంభం

వొజ్నియాకి శుభారంభం

న్యూయార్క్: ప్రపంచ మాజీ నంబర్‌వన్ కరోలైన్ వొజ్నియాకి యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో వొజ్నియాకి (డెన్మార్క్) 4-6, 6-3, 6-4తో టేలర్ టౌన్‌సెండ్ (అమెరికా)ను ఓడించింది. 2009, 2014లో ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన వొజ్నియాకి ఈ ఏడాది ఆడిన రెండు గ్రాండ్‌స్లామ్ (ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్) టోర్నీల్లోనూ తొలి రౌండ్‌లోనే నిష్కమ్రించింది.

గతేడాది రన్నరప్, ఏడో సీడ్ రొబెర్టా విన్సీ (ఇటలీ) 6-2, 6-4తో ఫ్రీడ్‌సమ్ (జర్మనీ)పై, 14వ సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 7-5, 6-3తో జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా)పై విజయం సాధించారు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో 13వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్‌‌స), 28వ సీడ్  క్లిజాన్ (స్లొవేకియా) తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు. కై ల్ ఎడ్మండ్ (బ్రిటన్) 6-2, 6-2, 6-3తో గాస్కేను బోల్తా కొట్టించగా... యూజ్నీ (రష్యా) 6-2, 6-1, 6-1తో క్లిజాన్‌ను ఓడించాడు. మాజీ చాంపియన్, ఏడో సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 6-4, 7-5, 6-1తో దుత్రా సిల్వా (బ్రెజిల్)పై గెలుపొందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement