
పది ఓవర్లలో చెన్నై స్కోరు 46/3
ఐపీఎల్-8లో భాగంగా మంగళవారం రాత్రి ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి 10 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 46 పరుగులు చేసింది
రాయ్పూర్: ఐపీఎల్-8లో భాగంగా మంగళవారం రాత్రి ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి 10 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 46 పరుగులు చేసింది. చెన్నై స్కోరు 16 పరుగుల వద్ద జహీర్ బౌలింగ్ లో ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్ (11) ఔటయ్యాడు. 34 పరుగుల వద్ద డ్వేన్ స్మిత్ (18) అల్బీ మోర్కెల్ బౌలింగ్ లో తొలి బంతికి ఔటయ్యాడు. 46 పరుగుల వద్ద మూడో వికెట్ రూపంలో రైనా (11) ఔట్ అయ్యాడు.ప్రస్తుతం ధోనీ(0), డుప్లెసిస్ (6)లు క్రీజులో ఉన్నారు.
ఢిల్లీ బౌలర్లలో జహీర్ ఖాన్, మోర్కెల్, జయంత్ యాదవ్ లు ఒక్కో వికెట్ తీశారు.