ఐపీఎల్ -7 లో భాగంగా ఇక్కడ పంజాబ్ ఎలెవన్ తో జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
అబుదాబి: ఐపీఎల్ -7 లో భాగంగా ఇక్కడ పంజాబ్ ఎలెవన్ తో జరుగుతున్న ట్వంటీ 20 మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఆది నుంచి పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. ఓపెనర్లు డ్వేన్ స్మిత్ (66), మెక్ కలమ్ (67) లు జట్టుకు శుభారంభాన్నిచ్చారు. అనంతరం సురేష్ రైనా (24), కెప్టెన్ ధోనీ (26) పరుగులు చేయడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో లక్ష్మిపతీ బాలాజీకి రెండు వికెట్లు లభించగా, అక్షర్ పటేల్, అవానకు తలో వికెట్టు దక్కింది.