దీపిక vs జోష్నా | Chinappa, Pallikal set up all-India final first time ever | Sakshi
Sakshi News home page

దీపిక vs జోష్నా

Published Sun, Apr 30 2017 2:23 AM | Last Updated on Tue, Sep 5 2017 9:59 AM

దీపిక vs జోష్నా

దీపిక vs జోష్నా

► ఆసియా స్క్వాష్‌ మహిళల టైటిల్‌ మనదే
► నేడు ఫైనల్లో అమీతుమీ


చెన్నై: భారత స్క్వాష్‌ చరిత్రలో ఆదివారం కొత్త చరిత్ర లిఖించబడనుంది. ప్రతిష్టాత్మక ఆసియా వ్యక్తిగత స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌ మహిళల వ్యక్తిగత విభాగంలో భారత్‌ నుంచి తొలి చాంపియన్‌ అవతరించనుంది. 31 ఏళ్ల ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో మొదటిసారి భారత్‌ నుంచి ఒకేసారి ఇద్దరు క్రీడాకారిణులు టైటిల్‌ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నారు.

శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌లో నాలుగో సీడ్‌ దీపిక పళ్లికల్‌ 11–9, 7–11, 11–7, 11–9తో టాప్‌ సీడ్‌ ఆనీ అవు (హాంకాంగ్‌)ను బోల్తా కొట్టించగా... రెండో సీడ్‌ జోష్నా చినప్ప 11–6, 11–4, 11–8తో ఆరో సీడ్‌ తోంగ్‌ వింగ్‌ (హాంకాంగ్‌)పై గెలిచింది. 1996లో భారత్‌ నుంచి మిషా గ్రెవాల్‌ మాత్రమే ఏకైకసారి ఫైనల్‌కు చేరుకొని రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత ఈ పోటీల్లో భారత్‌ నుంచి ఎవరూ ఫైనల్‌కు చేరుకోలేదు.

మరోవైపు పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ క్రీడాకారుడిగా సౌరవ్‌ ఘోషాల్‌ ఘనత వహించాడు. సెమీఫైనల్లో రెండో సీడ్‌ సౌరవ్‌ 11–6, 11–7, 11–3తో ఐదో సీడ్‌ లియో అవు (హాంకాంగ్‌)పై గెలుపొందాడు. ఆదివారం జరిగే ఫైనల్లో టాప్‌ సీడ్‌ మాక్స్‌ లీ (హాంకాంగ్‌)తో సౌరవ్‌ తలపడతాడు. రెండో సెమీఫైనల్లో మాక్స్‌ లీ 12–10, 11–6, 11–5తో నఫీజ్‌వాన్‌ అద్నాన్‌ (మలేసియా)ను ఓడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement