రాణించిన క్రెమెర్‌: విండీస్‌ 219 ఆలౌట్‌ | Cremer Puts Zimbabwe on Top in First Test Against Windies | Sakshi
Sakshi News home page

రాణించిన క్రెమెర్‌: విండీస్‌ 219 ఆలౌట్‌

Published Sun, Oct 22 2017 2:33 AM | Last Updated on Sun, Oct 22 2017 2:33 AM

Cremer Puts Zimbabwe on Top in First Test Against Windies

స్పిన్నర్లు గ్రేమ్‌ క్రెమెర్‌ (4/64), సీన్‌ విలియమ్స్‌ (3/20) మాయాజాలానికి విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు. ఫలితంగా బులవాయోలో జింబాబ్వేతో శనివారం మొదలైన తొలి టెస్టులో విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకే ఆలౌటైంది. ఒకదశలో 3 వికెట్లకు 174 పరుగులతో పటిష్టంగా కనిపించిన విండీస్‌ చివరి ఏడు వికెట్లను 45 పరుగుల తేడాలో కోల్పోవడం గమనార్హం. సహచరుల సహకారం లేకపోవడంతో షై హోప్‌ (90 నాటౌట్‌; 7 ఫోర్లు, ఒక సిక్స్‌) సెంచరీకి పది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఆట ముగిసేసరికి జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 19 పరుగులు చేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement