![Daddy I m Gonna be Like You : Cristiano Ronaldo JR - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/2/Cristiano-Ronaldo.jpg.webp?itok=5sBiUgoV)
తండ్రిలాగే ఆరుపలకల దేహాన్ని ప్రదర్శిస్తున్న జూనియర్ క్రిస్టియానో, క్రిస్టియానో రోనాల్డో
పోర్చుగల్ : వ్యక్తిగత స్వేచ్ఛ అంటూ దూసుకెళుతున్న ఈ రోజుల్లో పిల్లలు తమ తల్లిదండ్రులను అనుసరించడం చాలా అరుదు. చిన్నతనం నుంచే వారిపై ప్రత్యేక శ్రద్ధపెడితే తప్ప అది సాధ్యం కాదు. తండ్రి కొడుకుల మధ్య అనుబంధం స్నేహపూరిత వాతావరణంలో ఉంటేనే అది వీలవుతుంది. క్రిస్టియానో రోనాల్డో ఎంత ప్రఖ్యాతిగాంచిన ఫుట్‌బాల్ ప్లేయరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడు మ్యాచ్‌లు ముగిసే సందర్భాల్లో తన ఒంటిపై టీ షర్ట్ తీసి మైదానంలోనే తన కండలు, సిక్స్‌ప్యాక్ బాడీ చూపించే ప్రయత్నం చేస్తూ పొటోలకు పోజులిస్తుంటాడు.
అదే సమయంలో అతడి పెద్ద కుమారుడు జూనియర్ క్రిస్టియానో కూడా ఫుట్‌బాల్ మెలకులవలు నేర్పడం వాటిని అతడు అనుసరిస్తూ ఆ ఫొటోలను షేర్ చేయడం తండ్రికంటే ఎక్కువగా చేస్తుంటాడు. అయితే, ఓ సందర్భంలో క్రిస్టియానో తన ఆరుపలకల దేహాన్ని మైదానంలోనే చూపించగా ఎలాగైనా తాను కూడా అంతటి దేహాన్ని సంపాధించుకొని ప్రదర్శించాలని మనసులో పెట్టుకున్న జూనియర్ క్రిస్టియానో జిమ్‌లో ఉండి ఆరు పలకల దేహాన్ని ప్రదర్శించాడు. ఈ ఫొటో తండ్రి క్రిస్టియానే తీశాడు. ఆ ఫొటోకు 'డాడీ.. నేను కూడా మీలాగే ఉన్నాను చూడండి' అంటూ ట్యాగ్‌లైన్ పెట్టాడు. ఆ ఫొటోను రోనాల్డ్ షేర్ చేసుకున్నాడు. ఇంతకీ ఆ పిల్లాడి వయసు ఎంతో తెలుసా.. ఎనిమిదేళ్లకంటే తక్కువే. ఇంత తక్కువ వయసులోనే తండ్రిని అనుసరిస్తున్న ఈ బుడతడు కచ్చితంగా తండ్రిని మించిన తనయుడు అవుతాడని నెటిజన్లు అనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment