
హైదరాబాద్ భారీ స్కోరు
హెన్రీక్స్, వార్నర్ మెరుపు అర్ధశతకాలతో అదరగొట్టడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు చేసింది.
హైదరాబాద్: హెన్రీక్స్, వార్నర్ మెరుపు అర్ధశతకాలతో అదరగొట్టడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందు 136 పరుగుల టార్గెట్ ఉంచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. ధావన్(8) తొందరగానే అవుటైనా హెన్రీక్స్, వార్నర్ విజృంభణతో హైదరాబాద్ భారీ స్కోరు చేసింది.
హెన్రీక్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 22 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు బాదాడు. వార్నర్ 32 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ తో 52 పరుగులు సాధించాడు. మోర్గాన్ 11 పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లలో వీసే 2 వికెట్లు పడగొట్టాడు. స్టార్క్ ఒక వికెట్ తీశాడు. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 11 ఓవర్లకు కుదించారు. హైదరాబాద్ బ్యాటింగ్ ముగిసిన తర్వాత కూడా వర్షం ప్రారంభం కావడంతో మిగతా మ్యాచ్ జరుగుతుందా, లేదా అనేది అనుమానంగా మారింది.