ఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లోభాగంగా మంగళవారం ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ కరుణ్ నాయర్ తొలుత హైదరాబాద్ బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో ఈ మ్యాచ్‌లో నెగ్గితే కోల్‌కతాను వెనక్కినెట్టి హైదరాబాద్ రెండోస్థానానికి ఎగబాకుతుంది. మరొకవైపు తమ చివరిమ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన ఢిల్లీ ఈ మ్యాచ్‌లో నెగ్గి గాడిలో పడాలని భావిస్తోంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్థానం ఘనంగా సాగుతోంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర సెంచరీతో ఆ జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఓవరాల్‌గా తొమ్మిది మ్యాచ్‌ల నుంచి 459 పరుగులతో సత్తాచాటి టోర్నీలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. దీంతో ‘ఆరెంజ్ క్యాప్’ను తన సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఓపెనర్ శిఖర్ ధావన్ (341 పరుగులు), కేన్ విలియమ్సన్ (204 పరుగులు), మోజెస్ హెన్రిక్స్ (200) ఆకట్టుకుంటున్నారు. డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గాడిలో పడాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే టోర్నీలో అత్యుత్తమ బౌలింగ్ లైనప్ ఉన్న జట్లలో సన్‌రైజర్స్ ఒకటి. పేసర్ భువనేశ్వర్ కుమార్ తొమ్మిది మ్యాచ్‌ల్లోనే 20 వికెట్లు తీసి ‘పర్పుల్ క్యాప్’ను కైవసం చేసుకున్నాడు. అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్ (12 వికెట్లు), ఆశిష్ నెహ్రా (8), సిద్దార్థ్ కౌల్ (7) రాణిస్తున్నారు.
సన్ రైజర్స్ తుది జట్టు: డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్, హెన్రిక్స్, యువరాజ్ సింగ్, దీపక్ హుడా, నమాన్ ఓజా, భువనేశ్వర్ కుమార్, రషిద్ ఖాన్, సిద్ధార్ద్ కౌల్, మొహ్మద్ సిరాజ్
ఢిల్లీ డేర్ డెవిల్స్ తుది జట్టు: కరుణ్ నాయర్(కెప్టెన్), సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, ఏంజులా మాథ్యూస్, రిషబ్ పంత్, క్రిస్ మోరిస్, కోరీ అండర్సన్, జయంత్ యాదవ్, రబడా, అమిత్ మిశ్రా, మొహ్మద్ షమీ
సన్ రైజర్స్ ఫస్ట్ బ్యాటింగ్
Published Tue, May 2 2017 7:40 PM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM
Advertisement
Advertisement