దేవధర్‌ ట్రోఫీ ఫైనల్లో తమిళనాడు | Deodhar Trophy: Tamil Nadu thrash India A by 73 runs to enter final | Sakshi
Sakshi News home page

దేవధర్‌ ట్రోఫీ ఫైనల్లో తమిళనాడు

Published Tue, Mar 28 2017 1:31 AM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM

Deodhar Trophy: Tamil Nadu thrash India A by 73 runs to enter final

విశాఖపట్నం: విజయ్‌ హజారే ట్రోఫీ చాంపియన్‌ తమిళనాడు జట్టు దేవధర్‌ ట్రోఫీ వన్డే టోర్నమెంట్‌లో ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు 73 పరుగుల తేడాతో భారత్‌ ‘ఎ’ జట్టుపై గెలుపొందింది. మొదట తమిళనాడు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది.

దినేశ్‌ కార్తీక్‌ (93; 6 ఫోర్లు, 1 సిక్స్‌), జగదీశన్‌ (71; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు. ప్రత్యర్థి బౌలర్లలో శార్దుల్‌ ఠాకూర్‌ 3 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్‌ ‘ఎ’ 44.4 ఓవర్లలో 230 పరుగుల వద్ద ఆలౌటైంది. మన్‌దీప్‌ సింగ్‌ (97; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. బుధవారం జరిగే ఫైనల్లో భారత్‌ ‘బి’తో తమిళనాడు తలపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement