
అది ఐసీసీకే అర్థం కాదు!
డక్‌వర్త్–లూయిస్‌పై ధోని
లండన్: డక్‌వర్త్–లూయిస్ నిబంధన అనేది ఒక బ్రహ్మ పదార్థం! వర్షం పడిన సమయంలో ఇది సరిగ్గా ఎలా పని చేస్తుందో అర్థం కాక ఎంతో మంది కెప్టెన్లు జుట్టు పీక్కుంటే... లెక్క సరిగ్గా తేలక మ్యాచ్‌లు కోల్పోయిన దక్షిణాఫ్రికాలాంటి జట్లు కూడా ఉన్నాయి. చివరకు అంపైర్ చెబితే తప్ప ఎన్ని పరుగులు చేయాలో, చేయాల్సి ఉందో తెలీదు.
గతంలో భారత కెప్టెన్‌గా ధోని కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. సోమవారం జరిగిన కోహ్లి డిన్నర్ కార్యక్రమంలో ధోనిని ఈ విషయంపై ప్రశ్నించగా, అతను ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘నేను అర్థం చేసుకోవడం సంగతి తర్వాత. నాకు తెలిసి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి కూడా డక్‌వర్త్–లూయిస్ నిబంధన అర్థం కాదు’ అని అందులోని క్లిష్టత గురించి చెప్పేశాడు.