ఆ క్యాచ్ మిస్ చేయడమే కొంప ముంచింది: యువరాజ్
వెస్టిండీస్ ఆటగాడు జోనాథన్ కార్టర్ క్యాచ్ జట్టు విజయావకాశాలను దెబ్బ తీసింది అని ఇండియా ఏ జట్టు కెప్టెన్ యువరాజ్ సింగ్ అన్నాడు. అంతేకాకుండా జట్టు బౌలింగ్ కూడా దారుణంగా ఉంది అని.. కార్టర్ క్యాచ్ కూడా పరాజయానికి కారణమైంది అని యువరాజ్ అభిప్రాయపడ్డారు. పేలవమైన బౌలింగ్ తోడు బ్యాటింగ్ కూడా అంతంత మాత్రమేనన్నాడు.
విజయం సాధించాలంటే.. ఫీల్డింగ్ తోపాటు బౌలింగ్ కూడా బాగుండాలని మంగళవారం వెస్టిండీస్ ఏ జట్టుతో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ఓటమి పాలు కావడంపై యువరాజ్ విశ్లేషించాడు. తొలి మ్యాచ్ లో సెంచరీతో ఆలరించిన జట్టు విజయాన్ని అందించిన యువరాజ్ రెండవ వన్డేలో విఫలం కావడం విజయంపై ప్రభావం చూపింది. భారత జట్టు వెంటవెంటనే వికెట్లు కోల్పోవడం కూడా ప్రతికూలంగా మారింది.