
టెస్టులకు డ్వేన్ బ్రేవో గుడ్‌బై
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోలేకపోయిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. చివరి టెస్టు మ్యాచ్‌ను 2010 డిసెంబర్‌లో ఆడిన 31 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ వన్డే, టి20 ఫార్మాట్‌లో మాత్రం కొనసాగుతానని చెప్పాడు. ‘టెస్టు క్రికెట్‌కు నేను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే విండీస్ క్రికెట్ బోర్డుకు తెలిపాను. అలాగే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఆడాలనే నా కోరికను కూడా చెప్పాను. ఇన్నేళ్లుగా అంకితభావంతో, అంతులేని ఆసక్తితో ఆడాను. మా ప్రాంత ప్రజలు అత్యద్భుతమైన ఆటగాళ్లను గతంలో చూశారు.
కానీ మేం అప్పటి వైభవాన్ని తేలేకపోయాం. అయితే క్రికెట్‌పై మా ప్రేమ మాత్రం ఎప్పటిలాగే కొనసాగుతుంది. నాకు అన్నివేళలా అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు’ అని బ్రేవో అన్నాడు. కెరీర్‌లో 40 టెస్టులు ఆడిన బ్రేవో 2,200 పరుగులు చేయగా ఇందులో మూడు సెంచరీలున్నాయి. అలాగే 86 వికెట్లు తీశాడు.