
సౌతాంప్టన్: వరుసగా మూడు పరాజయాలతో ప్రపంచ కప్‌లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దక్షిణాఫ్రికాకు మరో కఠిన పరీక్ష. ఆ జట్టు సోమవారం సౌతాంప్టన్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. ఒకదాంట్లో గెలిచి, మరోటి ఓడిన కరీబియన్లకిది మూడో మ్యాచ్. మామూలుగా చూస్తే మొత్తం వన్డే గెలుపోటముల గణాంకాల్లో వెస్టిండీస్‌పై సఫారీలది తిరుగులేని ఆధిపత్యం. గత మూడు కప్‌లలోనూ వారిపై విజయం సాధించింది. కానీ, ఇప్పుడు పరిస్థితి అంతా తారుమారైంది. సెమీస్ రేసులో నిలవాలంటే దక్షిణాఫ్రికా తప్పక గెలవాల్సి ఉండగా, కరీబియన్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇరు జట్లు ఇప్పటివరకు ప్రపంచ కప్‌లో ఆరు మ్యాచ్‌ల్లో తలపడితే... నాలుగింటిలో సఫారీలు, రెండింటిలో కరీబియన్లు నెగ్గారు.
Comments
Please login to add a commentAdd a comment