
అండర్–19 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టు మరో వివాదానికి తెరతీసింది. గత ప్రపంచకప్‌లో విండీస్ జట్టు జింబాబ్వే ఆటగాడితో గొడవపడి ఐసీసీ రూల్స్‌ను ఉల్లంఘించడం అప్పట్లో సంచలనమైంది. తాజాగా దక్షిణాఫ్రికా ఓపెనర్ జివేషెన్ పిల్లే విషయంలో కూడా విండీస్ జట్టు అదే తీరుగా వ్యవహరించి అతడి ఔట్‌కు కారణమైంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఆ జట్టు ఓపెనర్ జివేషెన్ పిల్లే (47) విచిత్రంగా ఔటయ్యాడు. విండీస్ బౌలర్ హోతే వేసిన బంతిని పిల్లే ఆడగా అతడికే తాకి వికెట్ల వైపునకు వెళ్లింది. బ్యాట్‌తో ఆపేందుకు చూడగా బంతి ఆగిపోయింది. బంతిని తీసి విండీస్ కీపర్‌కు అందించాడు. అంతవరకు ఒకే, అయితే విండీస్ ఫీల్డర్లు జివేషెన్ పిల్లే ఔట్ కోసం అప్పీల్ చేశారు. ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని కోరగా రీప్లే అనంతరం సఫారీ ఓపెనర్ ఔట్ అంటూ స్క్రీన్ మీద కనిపించడంతో అయిష్టంగానే డ్రెస్పింగ్ రూముకు వెళ్లిపోయాడు. ఐసీసీ రూల్ 37.4 కింద బ్యాట్స్‌మెన్ ఔట్ అయినట్లు అంపైర్లు చెప్పారు. అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ తప్పిదం కింద ఫీల్డర్ల అనుమతి లేకుండానే బంతిని బ్యాట్స్‌మెన్ చేతిలోకి తీసుకున్నాడని తెలిపారు.
వంద సార్లు తాను ఈ విధంగా చేసినా అంపైర్లు ఎందుకు ఔటివ్వలేదని దక్షిణాఫ్రికా జాతీయ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ ట్వీట్ చేయడంతో పలువురు దీనిపై స్పందిస్తున్నారు. సాధారణంగా బ్యాట్స్‌మెన్ బంతిని తీసుకుని ఫీల్డర్లకు అందించడం చూస్తుంటాం. కానీ ప్రతిష్టాత్మకమైన అండర్ 19 ప్రపంచకప్‌లో ఇలాంటి ఔట్ చోటుచేసుకోవడం విచారకరమంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment