భారత్‌లో కోహ్లి బ్యాట్‌తోనే.. | England cricketer Danielle Wyatt to unleash Virat's gift in India | Sakshi
Sakshi News home page

భారత్‌లో కోహ్లి బ్యాట్‌తోనే..

Published Tue, Mar 13 2018 3:23 PM | Last Updated on Tue, Mar 13 2018 3:25 PM

England cricketer Danielle Wyatt to unleash Virat's gift in India - Sakshi

కోహ్లి-డానియెల్లి యాట్‌(ఫైల్‌ఫొటో)

న్యూఢిల్లీ: గతంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్‌ డానియెల్లి యాట్‌ పెళ్లి ప్రపోజ్‌ చేసిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లి ఆటకు ఫిదా అయిపోయిందో లేక ఇద్దరి కెరీర్ ఒకటే అనుకుందేమోగానీ ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి మనోడ్ని పెళ్లి చేసుకుంటానంటూ సరదాగా ఓ ప్రతిపాదన చేసింది. దాదాపు నాలుగేళ్ల క్రితం'నన్ను పెళ్లి చేసుకుంటావా కోహ్లి' అని ట్వీట్‌ చేసి వార్తల్లో నిలిచింది డానియల్లి యాట్‌.

ఆపై 2014లో టీమిండియా జట్టు ఇంగ్లండ్ లో పర్యటించినప్పుడు డానియెల్లికి కోహ్లి బ్యాట్‌ను కానుకగా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. దాంతో మురిసిపోయిన యాట్‌.. ఇక ఆ బ్యాట్‌తోనే క్రికెట్‌ ఆడతానడంటూ పేర్కొంది.

కాగా, ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా భారత్‌కు రానున్న యాట్‌.. త్వరలో చేపట్టబోయే భారత పర్యటనలో నేను కోహ్లి ఇచ్చిన బ్యాట్‌తోనే ఆడతానని మరోసారి స్పష్టం చేసింది.  ఈ మేరకు మీడియాతో మాట్లాడిన యాట్‌.. 'ఇప్పడు విదేశీ పర్యటనల్లో కూడా కోహ్లి బ్యాట్‌నే ఉపయోగిస్తున్నా. ఎందుకంటే నేను వాడే బ్యాట్‌ విరిగిపోయింది. భారత్‌తో సిరీస్‌లో కూడా కోహ్లి బ్యాట్‌తోనే ఆడతా’అని తెలిపింది. ముక్కోణపు టీ20 సిరీస్‌ మార్చి 23 నుంచి ప్రారంభం కానుంది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్లు ట్రై సిరీస్‌లో పాల్గొనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement