పీటర్సన్,కుక్
మెల్‌బోర్న్: బ్యాటింగ్ వైఫల్యంతో ఇప్పటికే యాషెస్ సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లండ్ ఇప్పుడు పరువు కోసం పోరాడుతోంది. సిరీస్‌కు ముందు ఫేవరెట్‌గా బరిలోకి దిగినా... ఆస్ట్రేలియా ధాటికి చావో... రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితికి పడిపోయింది.
ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య నేటి నుంచి బాక్సింగ్ డే (నాలుగో) టెస్టు జరగనుంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా స్థాయి మేరకు రాణించి పోయిన పరువును కాపాడుకోవాలని కుక్‌సేన భావిస్తుండగా... వరుసగా నాలుగో విజయం కోసం ఆసీస్ ప్రణాళికలు రచిస్తోంది. మూడు వరుస విజయాలతో ఆసీస్ ఆటగాళ్లలో ఒకరిద్దరు మినహా మిగతా వారందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. మరోవైపు కీలక బ్యాట్స్‌మెన్ ఫామ్‌లో లేకపోవడం, ప్రధాన స్పిన్నర్ స్వాన్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పడంతో ఇంగ్లండ్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. పీటర్సన్ ఫామ్ కూడా జట్టును కలవరపెడుతోంది. మిడిలార్డర్‌లో భారీ ఇన్నింగ్స్, భాగస్వామ్యాలు జోడించే సత్తా ఉన్నా బ్యాట్స్‌మెన్ అందుబాటులో లేకపోవడం లోటు. జట్టులో సమష్టితత్వం కొరవడింది. మూడో టెస్టులో గాయపడిన బ్రాడ్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉండగా, స్వాన్ స్థానంలో పనేసర్, ప్రయర్ స్థానంలో బెయిర్‌స్టో తుది జట్టులోకి రావొచ్చు.