‘టీమిండియాకు గట్టిపోటీ తప్పదు’ | Expect West Indies to Give Tough Competition To India Richards | Sakshi
Sakshi News home page

‘టీమిండియాకు గట్టిపోటీ తప్పదు’

Published Tue, Jul 30 2019 10:15 AM | Last Updated on Tue, Jul 30 2019 10:15 AM

Expect West Indies to Give Tough Competition To India Richards - Sakshi

ముంబై: కరీబియన్‌ పర్యటనకు వస్తున్న భారత జట్టుకు వెస్టిండీస్‌ గట్టిపోటీ ఇస్తుందని ఆ దేశ క్రికెట్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌ అన్నారు. కోహ్లి బృందం కరీబియన్‌లో మూడు టి20లు, మరో మూడు వన్డేలతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగే రెండు టెస్టు మ్యాచ్‌లు కూడా ఆడుతుంది.  ‘ఈ సిరీస్‌ ఏదో ఆషామాషీగా జరుగుతుందని నేను అనుకోను.

భారత్, వెస్టిండీస్‌ పోరు ఈసారి ఉత్కంఠభరితంగా జరుగుతుంది. విరాట్‌ కోహ్లి సేనకు విండీస్‌ జట్టు నుంచి సవాళ్లు తప్పవు. దీంతో పోటీ క్లిష్టంగా ఉంటుంది’ అని ఆయన తెలిపారు. భారత బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ మాట్లాడుతూ తన హృదయంలో వెస్టిండీస్‌కు ప్రత్యేక స్థానముందన్నారు. విండీస్‌ ఆటగాళ్లను ఎప్పుడూ అభిమానిస్తూనే ఉంటానని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement