‘పాండ్యా.. ఓ గ్యాంగ్‌ స్టర్‌’ | Fans Suggest Career Options For Hardik Pandya | Sakshi
Sakshi News home page

Sep 14 2018 12:51 PM | Updated on Sep 14 2018 4:17 PM

Fans Suggest Career Options For Hardik Pandya - Sakshi

పాండ్యా ఆటకు కావల్సింది ప్రతిభ.. ఫ్యాషన్‌కాదు అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాక్షి, స్పోర్ట్స్‌: అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పన్ను విరుగుతుందనే సామెత టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యాకు సెట్‌ అవుతుంది. ఇంగ్లండ్‌పై టీమిండియా టెస్టు సిరీస్‌ ఓడిపోవడానికి గల కారణాల్లో పాండ్యా ప్రధాన కారణమంటూ అతడిని అభిమానులు ట్రోల్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో పాండ్యా తనకు సంబంధించిన ఏ ఫోటో షేర్‌ చేసినా అభిమానులు నెగటివ్‌గా రెస్పాన్స్‌ అవుతున్నారు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు అనంతరం లండన్‌ వీధుల్లో విహరిస్తూ దిగిన ఫోటో షేర్‌ చేయగా దానిపై నెటిజన్లు మండిపడ్డారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌పై కూడా అభిమానులు చురకలు అంటిస్తున్నారు.

‘ఇంగ్లండ్‌ పర్యటనలో చాలా పోరాడాం. ఈ సిరీస్‌ చాలా ఉపయోగపడింది. చాలా రోజుల తర్వాత ఇంటికి రావడం సంతోషంగా ఉంది. కానీ తక్కువ సమయంలోనే ఆసియా కప్‌ కోసం బయల్దేరాలి’అంటూ తన న్యూ లుక్‌తో దిగిన ఫోటో పోస్ట్‌ చేశాడు. దీనిపై ఆగ్రహించిన అభిమానులు ‘నువ్వు క్రికెట్‌ ఆడటానికి పనికిరావు, ర్యాపర్‌గా సెట్‌ అవుతావు.. ఆ ప్రయ​త్నం మొదలు పెట్టు’ అంటూ సలహాలు ఇచ్చారు. ‘పాండ్యా నువ్వు ఓ గ్యాంగ్‌ స్టర్‌లా ఉన్నావు ’ అంటూ మరొకరు ట్వీట్‌ చేశారు. పాండ్యాకు స్టైల్‌ మీద ఉన్న ప్యాషన్‌ క్రికెట్‌పై లేదని మరికొంత మంది ఎద్దేవా చేశారు. ఇంగ్లండ్‌ సిరీస్‌లో పాండ్యా అట్టర్‌ఫ్లాఫ్‌ కావడంతోనే కోహ్లి సేన ఓడిపోయిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

చదవండి: పాండ్యా... నీకొచ్చిందేమిటో చెప్పు!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement