చెన్నై: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించడంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ర్యాంకింగ్స్‌లో స్థానాలు తారుమారు అయ్యాయి. మొదటి టెస్టులో విజయం తర్వాత అనూహ్యంగా టాప్‌కు దూసుకెళ్లిన ఇంగ్లండ్ తాజా ఓటమితో నాలుగో స్థానానికి పడిపోయింది. టీమిండియా మాత్రం పర్యాటక జట్టుపై విజయంతో నాలుగు నుంచి రెండో స్థానానికి దూసుకెళ్లింది. అయితే ఇప్పటికీ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎవరు అర్హత సాధిస్తారనేది మాత్రం మూడో టెస్టు తర్వాతే తేలనుంది.
ఒకవేళ టీమిండియా అహ్మదాబాద్ వేదికగా జరగనున్న పింక్ టెస్టులో విజయం సాధిస్తే 2-1 తేడాతో ఏ ఇబ్బంది లేకుండా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఇంగ్లండ్ విజయం సాధిస్తే మాత్రం చివరి టెస్టులోనూ కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. కాగా టీమిండియాకు ప్రస్తుతం 69.7 పీసీటీ పాయింట్లు ఉండగా.. ఇంగ్లండ్‌కు 67 పీసీటీ పాయింట్లు ఉన్నాయి. ఇప్పటికే 70 పీసీటీ పాయింట్లతో కివీస్ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. జూన్‌లో లార్డ్స్ వేదికగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
చదవండి: ఘన విజయం: దెబ్బకు దెబ్బ కొట్టిన టీమిండియా
'5 వికెట్లు.. ఈ డెబ్యూ చాలా స్పెషల్'
Comments
Please login to add a commentAdd a comment