బంగ్లా.. ఇప్పుడు నాగినీ డ్యాన్స్‌ చేయరేం? | Fans Troll Bangladesh Where is The Nagini Dance | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 21 2018 3:10 PM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM

Fans Troll Bangladesh Where is The Nagini Dance - Sakshi

అబుదాబి: ఆసియాకప్‌లో బంగ్లాదేశ్‌పై అఫ్గానిస్తాన్‌ సంచలన విజయం నమోదుచేసిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన ఈ పోరులో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రషీద్‌ ఖాన్‌ (57 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌) బంగ్లాదేశ్‌ను ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. దీంతో అఫ్గాన్‌ 136 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తుచేసింది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా బంగ్లా ఆటగాళ్లను ఆటపట్టిస్తున్నారు.

‘ఇప్పుడు నాగినీ డ్యాన్స్‌ చేయరేం?, అయ్యో.. బంగ్లా ఓడింది.. మేం నాగిని డ్యాన్స్‌ మిస్సయ్యాం. డియర్‌ బంగ్లాదేశ్‌.. ప్రతిరోజు నాగుల పంచమి ఉండదు.. నాగిని డ్యాన్స్‌ కంటే క్రికెట్‌ స్కిల్స్‌ మెరుగుపరుచుకోండి’   అనే కామెంట్స్‌తో ఎద్దేవా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ వైరల్‌ అయ్యాయి. గతేడాది శ్రీలంకలో జరిగిన నిదహాస్‌ ట్రోఫీలో భాగంగా బంగ్లా ఆటగాళ్ల నాగిని డ్యాన్స్‌.. ఫేమస్‌ అయిన విషయం తెలిసిందే. శ్రీలంకపై గెలిచిన ఆనందంలో అప్పుడు బంగ్లా ఆటగాళ్లు నాగిని డ్యాన్స్‌తో మైదానంలో చిందేశారు. ఇక బంగ్లాదేశ్‌ నేడు భారత్‌తో తలపడనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement