
ధోనికి జరిమానా
అంపైర్ నిర్ణయంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసినందుకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోని మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. ముంబై చేతిలో ఓటమి తర్వాత ధోని మాట్లాడుతూ ‘స్మిత్ ఎల్బీడబ్ల్యూ భయంకరమైన నిర్ణయం’ అన్నాడు. ఇది ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించడమేనని గవర్నింగ్ కౌన్సిల్ పేర్కొంది.