శ్రీనివాసన్‌కు ఎదురుదెబ్బ
జైపూర్: బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫిక్సింగ్ ఆరోపణలతో ఆయనతోపాటు చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్ మాజీ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేయాలని గంగానగర్ డిస్ట్రిక్ట్ అడిషినల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సతీష్ చంద్రా గోద్రా... జ్యోతినగర్ పోలీసులను ఆదేశించారు. ఐపీఎల్-6లో మే 12న జరిగిన చెన్నై, రాజస్థాన్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు గురైందని కోర్టులో దాఖలైన పిటిషన్‌ను విచారించిన జడ్జి పై ఆదేశాలు జారీ చేశారు.
గంగానగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి తరఫు లాయర్ మహ్మద్ అబ్ది అక్టోబర్ 26, 28న ఈ పిటిషన్ వేశారు. ఆర్థిక ప్రయోజనాల కోసం మ్యాచ్‌ల సందర్భంగా శ్రీనివాసన్, గురునాథ్‌లు చెన్నై జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపుతున్నారని అబ్ది ఆరోపించారు. ఫిక్సింగ్‌కు సంబంధించి శ్రీనివాసన్ కుమారుడు అశ్విన్, బీసీసీఐ మాజీ చీఫ్ ఐఎస్ బింద్రా చేస్తున్న ఆరోపణలు ఆయన విశ్వసనీయతను శంకిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను పిటిషన్‌లో జతపర్చిన అబ్ది శ్రీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.