
ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లేన్ మాక్స్‌వెల్ కీలక ప్రకటన చేశారు. క్రికెట్ నుంచి కొంతకాలం విరామం తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. మానసిక సమస్యల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, అందువల్లే క్రికెట్ నుంచి విరామం తీసుకోవాలని నిర్ణయించానని మ్యాక్స్‌వెల్ తెలిపారు. మ్యాక్స్‌వెల్ ప్రస్తుతం వన్డేలు, టీ-20ల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించారు. అతను గతంలో టెస్టులు కూడా ఆడారు. ఇప్పటివరకు 110 వన్డేలు ఆడిన మ్యాక్స్‌వెల్ 2877 పరుగులు చేశారు. ఇందులో ఒక సెంచరీ, 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి.