సన్ రైజర్స్ కు సాధారణ లక్ష్యం
హైదరాబాద్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఇక్కడ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ 136 పరుగుల సాధారణ లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ లయన్స్ తడబడుతూనే బ్యాటింగ్ కొనసాగించింది.గుజరాత్ ఆటగాళ్లలో జాసన్ రాయ్(31), దినేష్ కార్తీక్(30), డ్వేన్ స్మిత్(37)లు మాత్రమే ఫర్వాలేదనిపించారు. మిగతా ఆటగాళ్లు దారుణంగా విఫలం కావడంతో గుజరాత్ భారీ స్కోరు చేయలేకపోయింది. గుజరాత్ టాపార్డర్ ఆటగాళ్లలో బ్రెండన్ మెకల్లమ్(5), సురేష్ రైనా(5), అరోన్ ఫించ్(3)లు ఘోరంగా వైఫల్యం చెందారు.దాంతో నిర్ణీత ఓవర్లలో గుజరాత్ ఏడు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది.
రషీద్ షాక్
బెంగళూరుతో జరిగిన గత మ్యాచ్ లో రెండు వికెట్లు తీసి విజయంలో తనవంతు పాత్ర పోషించిన సన్ రైజర్స్ బౌలర్ రషీద్ ఖాన్ మరోసారి తన మ్యాజిక్ ను చూపెట్టాడు.గుజరాత్ మ్యాచ్ లో రషీద్ వరుస విరామాల్లో మూడు కీలక కీలక వికెట్లు తీసి రైజర్స్ కు చక్కటి ఆరంభాన్నిచ్చాడు. రషీద్ స్పిన్ మాయాజాలానికి గుజరాత్ కు గట్టి షాక్ తగిలింది. బ్రెండన్ మెకల్లమ్, ఫించ్, రైనాలను రషీద్ అవుట్ చేసి సత్తాచాటాడు. సన్ రైజర్స్ మిగతా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు సాధించగా, నెహ్రాకు వికెట్ దక్కింది.