
హర్భజన్ 'సెంచరీ'
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స ఆటగాడు హర్భజన్ సింగ్ సెంచరీ మార్కును చేరాడు.
హైదరాబాద్: ఐపీఎల్ లో ముంబై ఇండియన్స ఆటగాడు హర్భజన్ సింగ్ సెంచరీ మార్కును చేరాడు. ఐపీఎల్-8లో భాగంగా ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్తో హర్భజన్ సింగ్ ఒకే ఫ్రాంచేజి తరఫున 100 ఇన్నింగ్స్లు ఆడిన ఆటగాడిగా రికార్డులోకెక్కాడు. ఇంతవరకు ఈ ఫీట్ను సాధించిన ఆటగాడు సురేశ్ రైనా మాత్రమే. అతడు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున (ఒకే ఫ్రాంచేజి) తరఫున 100 ఇన్నింగ్స్లు ఆడాడు.
ఈ సందర్భంగా భజ్జీ ఏమన్నారంటే.. 'ఈ ఫీట్ను అందుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఏదో గొప్పగా సాధించానన్న సంతోషం కలిగింది.
బౌలింగ్ విషయంలో గత నాలుగు మ్యాచ్ల్లో చాలా నిరాశ చెందాను. కానీ, ఆదివారం బెంగళూరుతో మ్యాచ్లో బాగా రాణించాననిపిస్తోంది. అత్యంత కీలక వికెట్లను పగడొట్టి జట్టు విజయంలో తోడ్పడటం సంతోషాన్నిచ్చింది' అని అన్నారు.
ఇంతవరకు బ్యాటింగ్ సరిగా ఆడని భజ్జీ గత రెండు మ్యాచ్ల్లో బ్యాటుతో కూడా చెలరేగిపోయాడు. ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు.