సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్‌తో ఈ మధ్య ఆటతో కాకపోయినా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. అయితే తనకి రిటైర్మెంట్ సలహా ఇచ్చిన ఓ వ్యక్తికి భజ్జీ రిప్లై ఇస్తూ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
భజ్జీ ప్రస్తుతం రంజీ ట్రోఫీ-2017లో పంజాబ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఓ ఫోటోను భజ్జీ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అయితే నియోల్ స్మిత్ అనే వ్యక్తి ఆ ఫోటోపై తీవ్రంగా స్పందించాడు. ‘‘క్రికెట్‌లో నీ మంచి రోజులు అయిపోయాయి. పాత కుక్కవి అయిన నువ్వు కొత్త ట్రిక్కులు నేర్చుకోవడంలో విఫలమైన నీవు గౌరవప్రదంగా తప్పుకో. తెలివి తక్కువగా ప్రవర్తించి పేరును పాడుచేసుకోకు. నీ పని అయిపోయిందన్న సంగతిని గుర్తెరిగి వీలైనంత త్వరగా క్రికెట్ నుంచి తప్పుకుంటే మంచింది’’ అని పేర్కొంటూ ఓ ట్వీట్ చేశాడు.
ఇది హర్భజన్‌కు మంట పుట్టించింది. ‘‘నీలాంటి పాత కుక్కలు అరవడానికే పనికొస్తాయి. నువ్వా పనిలోనే ఉండు. నీవు నేర్చుకున్నది ఇంతే అన్నమాట. జీవితంలో ఓడిపోయిన వారే ఇటువంటి సలహాలు ఇస్తుంటారు. నేర్చుకునేందుకు ప్రతి రోజూ ఏదో ఒక విషయం ఉంటుంది. నీ సలహాలు నాకు అక్కర్లేదు. ముందసలు ఇతరులకు సలహాలు ఇవ్వడం మానుకో’’ అని ఘాటుగా ట్వీటాడు.
దీనికి స్పందించిన మరికొందరు ట్విట్టర్ యూజర్లు... నిన్ను ఇప్పటి వరకు జట్టు మోసింది చాలని, ఇక దయచేస్తేనే మంచిదని కొందరు కామెంట్ చేస్తే.. మరికొందరు బాగా బుద్ధి చెప్పారని భజ్జీని అభినందిస్తున్నారు. కాగా, 2015 నుంచి టెస్ట్-వన్డే ఫార్మట్‌లకు దూరమైన భజ్జీ.. చివరిసారిగా 2016లో యూఏఈలో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆడిన విషయం తెలిసిందే.
Old dog like u can only bark..so plz continue to do that.this is what u have learn I think all ur life..you have already lost the battle coz u have given up on learning new things.everyday there is new thing to learn. Provided we want to learn.dont teach others ur ways https://t.co/anTNHCeBxy
— Harbhajan Turbanator (@harbhajan_singh) November 22, 2017
Comments
Please login to add a commentAdd a comment