ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఎప్పటికప్పుడు స్టైల్ మారుస్తుంటాడు. తాజాగా మరోసారి తన స్టైల్ మార్చి ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. గుజరాత్ లయన్స్ క్రీడాకారుడు, టీమిండియా సహచరుడు రవీంద్ర జడేజా ఇటీవలే తన లుక్‌ను మార్చి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో.. దానికి సమాధానం అంటూ పాండ్యా కూడా తన లుక్‌ను మార్చుకుని దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పెట్టాడు. గెడ్డం పూర్తిగా తీసేసి.. కటింగ్ కూడా పూర్తిగా మార్చి సరికొత్త స్టైల్లో కనిపించాడు.
ఇంతకుముందు రవీంద్ర జడేజా కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మ్యాచ్‌కు ముందు ఒక వీడియో పెట్టాడు. అందులో తన కొత్త 'కూల్' లుక్‌ను చూపించాడు. జడేజాను చూసి ఆర్సీబీ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే అస్సలు నవ్వు ఆపుకోలేకపోయాడు. పాండ్యా కూడా దాదాపు జడేజా లాగే హెయిర్ కట్ అయితే చేయించుకున్నాడు గానీ జడేజాకు ఉన్నంత గెడ్డం గానీ, కోర మీసం గానీ పాండ్యాకు లేవు. ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు గెలిచింది. తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో తలపడనుంది. శనివారం సాయంత్రం వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.