వెస్టిండీస్ 276/6 | Harmer, Steyn benefit from wasteful WI | Sakshi
Sakshi News home page

వెస్టిండీస్ 276/6

Published Sat, Jan 3 2015 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 7:07 PM

వెస్టిండీస్ 276/6

వెస్టిండీస్ 276/6

కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో శుక్రవారం ప్రారంభమైన మూడో టెస్టులో వెస్టిండీస్ నిలకడగా ఆడుతోంది. జాన్సన్ (84 బంతుల్లో 9 ఫోర్లతో 54), దినేశ్ రామ్‌దిన్ (103 బంతుల్లో 6 ఫోర్లతో 53) అర్ధసెంచరీలు చేశారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 6 వికెట్లకు 276 పరుగులు చేసింది. బ్లాక్‌వుడ్ (102 బంతుల్లో 5 ఫోర్లతో 45 బ్యాటింగ్), హోల్డర్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

న్యూలాండ్స్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి విండీస్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో బ్రాత్‌వైట్ (7) విఫలమైనా.. స్మిత్ (86 బంతుల్లో 8 ఫోర్లతో 47) ఫర్వాలేదనిపించాడు. జాన్సన్‌తో కలిసి రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించాడు. మిడిలార్డర్‌లో శామ్యూల్స్ (70 బంతుల్లో 6 ఫోర్లతో 43) ఆకట్టుకున్నాడు. సీనియర్ ఆటగాడు చందర్‌పాల్ (9) నిరాశపర్చాడు. దక్షిణాఫ్రికా జట్టు కొత్త స్పిన్నర్ హర్మెర్ 3, పేస్ బౌలర్ స్టెయిన్ 2 వికెట్లు తీశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement