రాణించిన డు ప్లెసిస్, ఆమ్లా విండీస్‌తో మూడో టెస్టు
కేప్‌టౌన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సత్తా ప్రదర్శించారు. ఓపెనర్ పీటర్సన్ (85 బంతుల్లో 42; 3 ఫోర్లు; 1 సిక్స్) శుభారంభం అందించగా... డు ప్లెసిస్ (122 బంతుల్లో 68; 8 ఫోర్లు), కెప్టెన్ హషీమ్ ఆమ్లా (130 బంతుల్లో 55 బ్యాటింగ్; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఫలితంగా రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి 68.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి ప్రోటీస్ జట్టు 227 పరుగులు చేసింది.
క్రీజులో ఆమ్లాతో పాటు డివిలియర్స్ (52 బంతుల్లో 32 బ్యాటింగ్; 4 ఫోర్లు) ఉన్నాడు. వర్షం కారణంగా అరగంట ముందుగానే మ్యాచ్ నిలిచిపోయింది. విండీస్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కన్నా ఇంకా 102 పరుగులు వెనుకబడి ఉంది. ఆమ్లా, డివిలియర్స్ కలిసి నాలుగో వికెట్‌కు అభేద్యంగా 70 పరుగులు జోడించారు.
హోల్డర్, బెన్‌లకు చెరో వికెట్ దక్కింది. అంతకుముందు 276/6 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన విండీస్ 99.5 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బ్లాక్‌వుడ్ (113 బంతుల్లో 56; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. స్టెయిన్‌కు నాలుగు, హార్మర్‌కు మూడు వికెట్లు పడ్డాయి.
దక్షిణాఫ్రికా 227/3
Published Sun, Jan 4 2015 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM
Advertisement
Advertisement