దక్షిణాఫ్రికా లక్ష్యం 124 | south africa target is 124 | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా లక్ష్యం 124

Published Tue, Jan 6 2015 12:36 AM | Last Updated on Sat, Sep 2 2017 7:15 PM

south africa target is 124

కేప్‌టౌన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా విజయం దిశగా సాగుతోంది. 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు సోమవారం నాలుగో రోజు బరిలోకి దిగిన సఫారీ జట్టు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 2.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. ఎల్గర్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. పీటర్సన్ (0) విఫలమయ్యాడు. అంతకుముందు 88/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 79.5 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. శామ్యూల్స్ (74), చందర్‌పాల్ (50) అర్ధసెంచరీలు చేయగా, జాన్సన్ (44) ఫర్వాలేదనిపించాడు. హర్మెర్ 4, స్టెయిన్ 3, మోర్కెల్ 2 వికెట్లు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement