బీసీసీఐ తాత్కాలిక సీఈఓగా హేమంగ్‌ అమీన్‌  | Hemang Amin Is The Interim CEO Of BCCI | Sakshi
Sakshi News home page

బీసీసీఐ తాత్కాలిక సీఈఓగా హేమంగ్‌ అమీన్‌ 

Published Wed, Jul 15 2020 2:42 AM | Last Updated on Wed, Jul 15 2020 2:42 AM

Hemang Amin Is The Interim CEO Of BCCI - Sakshi

ముంబై: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) రోజూవారీ కార్యకలాపాల పర్యవేక్షణకు తాత్కాలిక ప్రాతిపదికన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)ను నియమించింది. హేమంగ్‌ అమీన్‌ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. రాహుల్‌ జోహ్రి ఇటీవలే రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో సీఈఓ ఎంపిక అనివార్యమైంది. అమీన్‌ ఐపీఎల్‌కు చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా పని చేశారు. 2019 ఐపీఎల్‌ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రద్దుచేసి ఆ మొత్తాన్ని ఫుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల సంక్షేమం కోసం ఇవ్వాలని నిర్ణయించింది ఆయనే. ‘గత రెండేళ్లుగా బీసీసీఐలో హేమంగ్‌ ఎంతో బాధ్యతతో పని చేస్తున్నారు. బీసీసీఐకి వ్యాపార ఒప్పందాలు కుదర్చడంలో కూడా కీలకపాత్ర పోషించారు. నిజాయితీపరుడు, సమర్థుడైన హేమంగ్‌ ఈ పదవికి సరైన వ్యక్తి’ అని బీసీసీఐ సీనియర్‌ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement