ధోని, కోహ్లి లేనిది వరల్డ్ ఎలెవన్ ఎలా..?
లాహోర్: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లిలు లేనిది వరల్డ్ ఎలెవన్ జట్టు ఎలా అవుతుందని క్రికెట్ అభిమానులు ఐసీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్వీటర్ వేదికగా ఐసీసీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక పాక్ క్రికెట్ చరిత్రలో సెప్టెంబర్ 12 చిరకాల రోజుగా నిలచింది. చాలా రోజుల తర్వాత పాక్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగకపోవడం, వరల్డ్ ఎలెవన్‌పై సర్ఫారజ్ జట్టు విజయం సాధించడంతో పాక్ అభిమానలు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
2009లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదుల దాడి అనంతరం ఏ దేశం పాక్‌లో పర్యటించలేదు. ఒక్క జింబాంబ్వే 2015న పర్యటించినా అది పాక్ అభిమానులను ఆకట్టుకోలేదు. దీంతో ఐసీసీ వరల్డ్ ఎలెవన్ జట్టుతో పాక్ టీ20 సిరీస్‌ను ఏర్పాటు చేసింది. దీనిపై పాక్ అభిమానులు ఐసీసీపై ప్రశంసలు కురిపిస్తున్నా అది వరల్డ్ ఎలెవన్ జట్టు ఎలా అవుతుందని ప్రశిస్తున్నారు. ప్రపంచ అత్యత్తుమ ఆటగాళ్లు అయిన భారత క్రికెటర్లు లేనిది ప్రపంచ జట్టు అని ఎలా పిలుస్తారని మండిపడుతున్నారు. జట్టులోకి ధోని, కోహ్లిని తీసుకురావాలని కోరుతూ ఐసీసీకి రెండు నిమిషాల మౌనం అంటూ ట్వీట్ చేస్తున్నారు.