World XI
-
జో రూట్, స్టీవ్ స్మిత్‌లకు దక్కని చోటు..!
టీమిండియా మాజీ హెడ్ కోచ్ సంజయ్ బాంగర్ ప్రస్తుత తరంలో తన ఫేవరెట్ వరల్డ్ ప్లేయింగ్ ఎలెవెన్‌ను ప్రకటించాడు. ఈ జట్టుకు ఓపెనర్లుగా రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్‌లను ఎంపిక చేసిన బాంగర్.. వన్‌డౌన్‌లో కేన్ విలియమ్సన్, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి, వికెట్‌కీపర్‌గా రిషబ్ పంత్, ఆల్‌రౌండర్ల కోటాలో బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్, పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, జోష్ హజిల్‌వుడ్‌ను ఎంపిక చేశాడు. బాంగర్ తన వరల్డ్ ఫేవరెట్ జట్టులో వరల్డ్ టాప్ టెస్ట్ బ్యాటర్లు జో రూట్, స్టీవ్ స్మిత్‌లకు చోటివ్వకపోవడం గమనార్హం.ఇదిలా ఉంటే, రావ్ పోడ్కాస్ట్తో బాంగర్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్ ఓ దశలో తనతో టెస్ట్ డబుల్ సెంచరీల గురించి డిస్కస్ చేశాడని చెప్పాడు. అప్పటి వరకు విరాట్ టెస్ట్‌ల్లో ఒక్క డబుల్ సెంచరీ కూడా చేయలేదని అన్నాడు. అది అతని కెరీర్లో వెలితిగా ఉండేదని చెప్పాడు. అయితే విరాట్ డబుల్ సెంచరీలు ఎలా చేయాలో తెలుసుకున్న తర్వాత ఒకే సీజన్లో నాలుగైదు డబుల్ సెంచరీలు చేసి తానేంటో నిరూపించుకున్నాడని గుర్తు చేశాడు.బ్యాటింగ్‌లో విరాట్ ఓ జీనియస్ అని కొనియాడాడు. అతను పట్టుపట్టాడంటే సాధించే వరకు వదలడని తెలిపాడు. విరాట్‌లా కష్టపడే వారు జట్టులో మరొకరు లేరని ప్రశంసించాడు. అతను జట్టు కోసం ఎంతో చేశాడని అన్నాడు. అతను దూకుడు మనిషే కానీ, అదే చాలా సందర్భాల్లో జట్టు విజయాలకు దోహదపడిందని గుర్తు చేశాడు. విరాట్ విదేశాల్లో రాణించేందుకు ఎక్కువగా ఇష్టపడతాడని తెలిపాడు. జట్టు సభ్యులు కూడా విదేశీ పిచ్‌లపై రాణించాలని విరాట్ కోరుకుంటాడని అన్నాడు. -
రీఎంట్రీపై అఫ్రిది స్పందన
-
రీఎంట్రీపై అఫ్రిది ఏమన్నాడంటే ?
లార్డ్స్ : అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేసే ఉద్దేశమే లేదని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది స్పష్టం చేశాడు. గురువారం ఐసీసీ నిర్వహించిన చారిటీ మ్యాచ్‌లో వరల్డ్ ఎలెవన్ జట్టుకు అఫ్రిది సారథ్యం వహించాడు. కరీబియన్ దీవుల్లో హరికేన్ కారణంగా దెబ్బ తిన్న స్టేడియాల పునరుద్ధరణకు నిధుల సేకరణ నిమిత్తం ఐసీసీ ఈ మ్యాచ్‌ను నిర్వహించింది. ఈ మ్యాచ్ సందర్భంగా మైదానంలో హడావిడి చేసిన కామెంటేటర్ నాసర్ హుస్సెన్ అఫ్రిదిని ‘అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేసే ఆలోచనలో ఉన్నారా?’ అని ప్రశ్నించాడు. దీనికి అఫ్రిదీ ‘అలాంటిదేం లేదు, నా పరిస్థితి చూడు గాయాలతో ఎలా ఉన్నానో అని నవ్వుతూ బదులిచ్చాడు’. మరిచిపోలేని ఘటన.. ఈ మ్యాచ్‌తో అఫ్రిదికి జీవితంలో మరిచిపోలేని ఘటన ఎదురైంది. ఆటగాళ్ల నుంచి సముచిత గౌరవం లభించింది. మ్యాచ్ ప్రారంభం ముందు వరల్డ్ ఎలెవన్ ఆటగాళ్లు చప్పట్లతో అఫ్రిదికి స్వాగతం పలికారు. దీనిపై ఈ 38 ఏళ్ల ఆటగాడు సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఇది చాలా ప్రత్యేకం. నా జీవితంలో మరిచిపోలేను. క్రికెట్ కుటుంబంలో జరిగింది. అద్భుతం. సాయం చేయడానికి వచ్చిన అందరికి ధన్యవాదాలు’ అని తెలిపాడు. అఫ్రిది 20,000 యూఎస్ డాలర్లను హరికేన్ రిలీఫ్ ఫౌండేషన్‌కు విరాళంగా ప్రకటించాడు. ఇక ఆటగాళ్లంతా తమ ఫీజును డొనేట్ చేశారు. లార్డ్స్ వేదికగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో వరల్డ్ ఎలెవన్ జట్టుపై 72 పరుగుల తేడాతో వెస్టిండీస్ జట్టు భారీ విజయాన్ని అందుకుంది. చదవండి : 72 పరుగులతో వెస్టిండీస్ భారీ విజయం! -
72 పరుగులతో వెస్టిండీస్ భారీ విజయం!
లండన్ : ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో వరల్డ్ ఎలెవన్ జట్టుపై 72 పరుగుల తేడాతో వెస్టిండీస్ జట్టు భారీ విజయాన్ని అందుకుంది. హరికేన్ కారణంగా దెబ్బతిన్న మైదానాల పునరుద్ధరణకు నిధులు సేకరించే నిమిత్తం లండన్‌లోని లార్డ్స్ మైదానంలో ఈ చారిటీ టీ-20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు ఆద్యంతం అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. మొదట బ్యాటింగ్ చేసిన కరేబియన్లు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేశారు. చెలరేగి ఆడిన ఎవిన్ లెవిస్ 26 బంతుల్లో 58 పరుగులు చేశాడు. షాహిద్ ఆఫ్రిదీ నేతృత్వంలో బరిలోకి దిగిన వరల్డ్ ఎలెవన్ జట్టు.. 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో చతికిలపడింది. ఏ దశలోనూ గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. థిసరా పేరారా ఒక్కడే రాణించి 61 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లు చేతులు ఎత్తేయడంతో 127 పరుగులకు వరల్డ్ ఎలెవన్ చాప చుట్టేసింది. దీంతో టీ-20 చాంపియన్స్ వెస్టిండీస్ జట్టు భారీ విజయాన్ని అందుకుంది. అద్భుతంగా రాణించిన ఎవిన్ లెవిస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. -
క్రికెట్ స్టేడియంలో ఆసక్తికర సన్నివేశం
లాహోర్: ఇటీవల జరిగిన పాకిస్తాన్, వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య జరిగిన తొలి ట్వంటీ-20 ప్రారంభానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రపంచ ఎలెవన్ జట్టు క్రికెటర్లను రెండు ప్రత్యేక ఆటోలలో లాహోర్ స్డేడియంలోకి ఆహ్వానించారు. అయితే ఆదిలోనే ఓ ఆటో మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఆటోలో కూర్చుని ఉన్న క్రికెటర్లే దిగి ఆ ఆటోని తోయాల్సి వచ్చింది. సాధారణంగా ఆర్టీసీ బస్సులు ఆగినప్పుడు ప్రయాణికులు దిగి బస్సును తోస్తుంటారు. ఇదే పరిస్థితి అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లకు తలెత్తింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది ట్వంటీ20 సిరీస్‌ను 2-1తో పాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే చాలా ఏళ్ల తర్వాత పాక్‌లో నిర్వహించిన అంతర్జాతీయ టోర్నీ ఇది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు తమ దేశానికి వచ్చిన వరల్డ్ ఎలెవన్ ఆటగాళ్లను వినూత్నంగా ఆటోలలో స్డేడియంలోకి తీసుకువచ్చారు. కానీ వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ డారెన్ సామి కూర్చున్న ఆటో మధ్యలో ఆగిపోయింది. దీంతో సామితో పాటు ఉన్న ఇంటర్నేషనల్ క్రికెటర్లు వెంటనే ఆటో నుంచి కిందకి దిగి వాహనాన్ని కొద్ది దూరం తోయడంతో స్టార్ట్ అయింది. క్రికెటర్లు హుషారుగా ఆటోలలో మైదానంలో తిరిగారు. కొందరు దీన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేయగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. -
క్రికెట్ స్టేడియంలో ఆసక్తికర సన్నివేశం
-
ధోని, కోహ్లి లేనిది వరల్డ్ ఎలెవన్ ఎలా..?
లాహోర్: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లిలు లేనిది వరల్డ్ ఎలెవన్ జట్టు ఎలా అవుతుందని క్రికెట్ అభిమానులు ఐసీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్వీటర్ వేదికగా ఐసీసీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక పాక్ క్రికెట్ చరిత్రలో సెప్టెంబర్ 12 చిరకాల రోజుగా నిలచింది. చాలా రోజుల తర్వాత పాక్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగకపోవడం, వరల్డ్ ఎలెవన్‌పై సర్ఫారజ్ జట్టు విజయం సాధించడంతో పాక్ అభిమానలు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 2009లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదుల దాడి అనంతరం ఏ దేశం పాక్‌లో పర్యటించలేదు. ఒక్క జింబాంబ్వే 2015న పర్యటించినా అది పాక్ అభిమానులను ఆకట్టుకోలేదు. దీంతో ఐసీసీ వరల్డ్ ఎలెవన్ జట్టుతో పాక్ టీ20 సిరీస్‌ను ఏర్పాటు చేసింది. దీనిపై పాక్ అభిమానులు ఐసీసీపై ప్రశంసలు కురిపిస్తున్నా అది వరల్డ్ ఎలెవన్ జట్టు ఎలా అవుతుందని ప్రశిస్తున్నారు. ప్రపంచ అత్యత్తుమ ఆటగాళ్లు అయిన భారత క్రికెటర్లు లేనిది ప్రపంచ జట్టు అని ఎలా పిలుస్తారని మండిపడుతున్నారు. జట్టులోకి ధోని, కోహ్లిని తీసుకురావాలని కోరుతూ ఐసీసీకి రెండు నిమిషాల మౌనం అంటూ ట్వీట్ చేస్తున్నారు. Na #ViratKohli na #MSDhoni And they call it #World Xl 2 minutes of silence for #ICC — Dmesh Teckchandani (@DMESHT) 13 September 2017 -
లాహోర్‌కు చేరుకున్న వరల్డ్ ఎలెవన్ జట్టు
లాహోర్: గత ఎనిమిదేళ్లుగా ఏ జట్టు చేయని సాహసం ప్రపంచ ఎలెవన్ క్రికెట్ జట్టు చేసింది. 2009లో శ్రీలంక క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న బస్సు పై దాడి జరిగిన అనంతరం పాకిస్తాన్లో ఇంతవరకు ఏ అంతర్జాతీయ జట్టు పర్యటించలేదు. అయితే తాజాగా పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌ను ఆడేందుకు 13 మంది ఆటగాళ్ల ప్రపంచ ఎలెవన్ జట్టు ఈ రోజు లాహోర్ చేరుకుంది. ఈనెల 12, 13,15 తేదీల్లో లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో పాకిస్థాన్-వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య మూడు టీ 20 మ్యాచ్ లు జరుగనున్నాయి. సుదీర్ఘ విరామం అనంతరం తమ దేశానికి విచ్చేసిన అంతర్జాతీయ ఆటగాళ్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పటిష్ట భద్రత నడుమ ప్రత్యేక బస్సులో వారిని హోటల్‌కు తరలించారు. ప్రపంచ ఎలెవన్ జట్టుకు దక్షిణాఫ్రికా కెప్టెన్ డూప్లెసిస్ సారథ్యం వహిస్తున్నాడు. అయితే బీసీసీఐ నుంచి అనుమతి లేకపోవడంతో వరల్డ్ ఎలెవన్ తరపున భారత క్రికెటర్లు ఎవరూ పాల్గొనడం లేదు. వరల్డ్ ఎలెవన్: డు ప్లెసిస్(కెప్టెన్-దక్షిణాఫ్రికా),హషీమ్ ఆమ్లా(దక్షిణాఫ్రికా), శామ్యూల్ బద్రీ(వెస్టిండీస్), జార్జ్ బెయిలీ(ఆస్ట్రేలియా), పాల్ కాలింగ్ వుడ్(ఇంగ్లండ్), బెన్ కట్టింగ్, గ్రాంట్ ఎలియట్(న్యూజిలాండ్), తమీమ్ ఇక్బాల్(బంగ్లాదేశ్), డేవిడ్ మిల్లర్(దక్షిణాఫ్రికా), మోర్నీ మోర్కెల్(దక్షిణాఫ్రికా), టిమ్ పానీ(ఆస్ట్రేలియా), తిషారా పెరీరా(శ్రీలంక), ఇమ్రాన్ తాహీర్(దక్షిణాఫ్రికా), డారెన్ సామీ(వెస్టిండీస్) -
వరల్డ్ ఎలెవన్ క్రికెట్ జట్టు ఇదే..
లాహోర్: ఇండిపెండెన్స్ కప్ సిరీస్ లో భాగంగా పాకిస్థాన్ లో పర్యటించే వరల్డ్ ఎలెవన్ క్రికెట్ జట్టును అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) గురువారం ప్రకటించింది. ఈ జట్టుకు దక్షిణాఫ్రికాకు చెందిన డు ప్లెసిస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. 14 మంది సభ్యులతో కూడిన జట్టులో ఐదుగురు దక్షిణాఫ్రికా క్రికెటర్లకు స్థానం దక్కడం ఇక్కడ విశేషం. ప్రస్తుతం దక్షిణాఫ్రికా టెస్టు, టీ 20 జట్టుకు సారథిగా ఉన్న డు ప్లెసిస్ ను వరల్డ్ ఎలెవన్ కెప్టెన్ నియమించగా, ఇందులో ఏడు దేశాలకు చెందిన అంతర్జాతీయ ఆటగాళ్లు ఆడుతున్నారు. అయితే పాక్ కు వెళ్లే వరల్డ్ ఎలెవన్ జట్టులో భారత ఆటగాళ్లకు స్థానం దక్కకపోవడానికి కారణం బీసీసీఐ నుంచి అనుమతి లేకపోవడమే. వచ్చేనెల 12, 13,15 తేదీల్లో లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో పాకిస్థాన్-వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య మూడు టీ 20 మ్యాచ్ లు జరుగనున్నాయి. వరల్డ్ ఎలెవన్ కు జింబాబ్వే మాజీ ఆటగాడు ఆండీ ఫ్లవర్ కోచ్ గా వ్యవహరించనున్నాడు. 2009లో లాహోర్ లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రదాడి జరిగిన తరువాత పాక్ కు వెళ్లడానికి ఏ అంతర్జాతీయ జట్టు ముందుకు రావడం లేదు. ఇప్పుడు వరల్డ్ ఎలెవన్ జట్టు పాక్ లో ఆడటంతో అక్కడ పూర్వవైభవం తీసుకురావాలని పీసీబీ యత్నిస్తోంది. మరొకవైపు శ్రీలంక, వెస్టిండీస్ జట్లు పాక్ పర్యటనకు అంగీకారం తెలపడం కూడా పీసీబీకి ఊరట కల్గించే విషయమే. వరల్డ్ ఎలెవన్: డు ప్లెసిస్(కెప్టెన్-దక్షిణాఫ్రికా),హషీమ్ ఆమ్లా(దక్షిణాఫ్రికా), శామ్యూల్ బద్రీ(వెస్టిండీస్), జార్జ్ బెయిలీ(ఆస్ట్రేలియా), పాల్ కాలింగ్ వుడ్(ఇంగ్లండ్), బెన్ కట్టింగ్, గ్రాంట్ ఎలియట్(న్యూజిలాండ్), తమీమ్ ఇక్బాల్(బంగ్లాదేశ్), డేవిడ్ మిల్లర్(దక్షిణాఫ్రికా), మోర్నీ మోర్కెల్(దక్షిణాఫ్రికా), టిమ్ పానీ(ఆస్ట్రేలియా), తిషారా పెరీరా(శ్రీలంక), ఇమ్రాన్ తాహీర్(దక్షిణాఫ్రికా), డారెన్ సామీ(వెస్టిండీస్)