తడబడిన హైదరాబాద్ బౌలర్లు | Hyderabad bowlers are struggled to bowel | Sakshi
Sakshi News home page

తడబడిన హైదరాబాద్ బౌలర్లు

Published Mon, Aug 18 2014 11:45 PM | Last Updated on Fri, Sep 7 2018 2:20 PM

తడబడిన హైదరాబాద్ బౌలర్లు - Sakshi

తడబడిన హైదరాబాద్ బౌలర్లు

ముంబై భారీ స్కోరు 
బుచ్చిబాబు టోర్నీ

 
చెన్నై: బుచ్చిబాబు క్రికెట్ టోర్నమెంట్‌లో ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు తడబడ్డారు. సోమవారం ఇక్కడ ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ముంబై 100 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముంబై బ్యాట్స్‌మెన్ బ్రావిష్ శెట్టి (157), నిఖిల్ పాటిల్ (123) సెంచరీలతో చెలరేగారు. హైదరాబాద్ బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ మెహదీ హసన్ 121 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా...లెఫ్టార్మ్ సీమర్ అన్వర్ ఖాన్ 48 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.
 
మరో వైపు అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆంధ్ర 100 ఓవర్లలో 365 పరుగులు చేసింది. కె.భరత్ రెడ్డి (96), శ్రీకర్ భరత్ (95) సెంచరీలు చేజార్చుకోగా...జి. చిరంజీవి (66), బోడ సుమంత్ (41) రాణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement