సాక్షి, హైదరాబాద్: అమెరికాలో ఆదరణ పొందిన రాకెట్‌బాల్ క్రీడలో హైదరాబాద్ కుర్రాడు అద్వైత్ రాణిస్తున్నాడు. గత ఆరేళ్లుగా ఈ ఆటలో రాణిస్తున్న ఈ తెలుగు సంతతి కుర్రాడికి తాజాగా అమెరికా రాకెట్‌బాల్ జట్టులో స్థానం దక్కింది. ఆ దేశ జాతీయ జట్టుకు ఎంపికైన తొలి తెలుగు కుర్రాడిగా అతను ఘనతకెక్కాడు.
మూడేళ్ల క్రితం 2014లో జాతీయ రాకెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన అద్వైత్... అనంతరం నేషనల్ జూనియర్ ఒలింపిక్స్‌లో తృటిలో కాంస్యం కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచాడు. తన తల్లిదండ్రులు అర్చన, కార్తీక్‌లు ఇచ్చిన ప్రోత్సాహంతో మేటి రాకెట్‌బాల్ ప్లేయర్‌గా ఎదగడమే తన లక్ష్యమని అద్వైత్ ‘సాక్షి’తో చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment