అందులో వాస్తవం లేదు:హెచ్సీఏ | Hyderabad Will Host India-Bangladesh Test, Reiterates HCA Secretary | Sakshi

అందులో వాస్తవం లేదు:హెచ్సీఏ

Jan 9 2017 2:41 PM | Updated on Sep 5 2017 12:49 AM

అందులో వాస్తవం లేదు:హెచ్సీఏ

అందులో వాస్తవం లేదు:హెచ్సీఏ

వచ్చే నెల్లో నగరంలో బంగ్లాదేశ్తో జరిగే భారత జట్టు ఆడే ఏకైక టెస్టు మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వడం లేదంటూ వచ్చిన వార్తలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఖండించింది

హైదరాబాద్:వచ్చే నెల్లో నగరంలో బంగ్లాదేశ్-భారత్ జట్ల మధ్య జరిగే  ఏకైక టెస్టు మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వడం లేదంటూ వచ్చిన వార్తలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఖండించింది. బంగ్లాదేశ్తో జరిగే టెస్టు  మ్యాచ్ను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు హెచ్సీఏ సెక్రటరీ కే జాన్ మనోజ్ స్పష్టం చేశారు. గతంలో కూడా ఇక్కడ నగరంలో టెస్టు మ్యాచ్లు నిర్వహించడానికి ఏనాడు వెనకడుగు వేయలేదని విషయాన్ని గుర్తించుకోవాలన్నాడు.

 

'టెస్టు మ్యాచ్ నిర్వహణలో భాగంగా స్టేడియం అడ్వర్టైజ్మెంట్కు సంబంధించి టెండర్ నోటీసును కూడా జారీ చేశాం. మ్యాచ్ కు సంబంధించి మీడియాతో ఒప్పందం కూడా ఒకటి రెండు రోజుల్లో జరుగుతుంది. మ్యాచ్ను నిర్వహించడం లేదనే రూమర్లు ఎక్కడ్నుంచి వచ్చాయో తెలియడం లేదు'అని మనోజ్ తెలిపారు.  ఫిబ్రవరి 13వ తేదీ నుంచి హైదరాబాద్లో భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరుగనుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement