భారత్, బంగ్లాదేశ్ జట్లు తొలిసారి ఫ్లడ్ లైట్ల వెలుగులో రేపటి నుంచి గులాబీ బంతితో టెస్టు మ్యాచ్ ఆడనున్నాయి. బంతి, పిచ్ స్పందించే తీరు తదితర అంశాలపై మ్యాచ్‌కు ముందు అభిమానులకు సాధారణ సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్నింటికి జవాబులు చూస్తే...
పిచ్‌లో ఏమైనా మార్పులు చేస్తున్నారా?
మామూలు టెస్టు మ్యాచుల్లోనే పిచ్ ప్రభావం ఉంటుంది. పింక్ టెస్టులో ఇది కొంత ఎక్కువగా కనిపించవచ్చు. గులాబీ బంతి బాగా కనిపించడమే అన్నింటికంటే కీలకం కాబట్టి బంతి తొందరగా పాడు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందు కోసం పిచ్‌పై 6 మిల్లీమీటర్ల వరకు పచి్చక ఉంచుతారు. దీంతో బంతి మెరుపుదనం తొందరగా దెబ్బ తినదు. 2015లో సిడ్నీలో జరిగిన తొలి పింక్ టెస్టులో 11 మిల్లీమీటర్ల వరకు పచి్చక ఉంచారు. అయితే పచ్చిక కారణంగా పేస్ బౌలింగ్‌కు అనుకూలిస్తుందనుకోవడం తప్పు. పేసర్లు పండగ చేసుకునే ‘గ్రీన్ టాప్’కు ఇది పూర్తిగా భిన్నం. ఈడెన్ గార్డెన్స్‌లో అవుట్‌ఫీల్డ్ కూడా ఎక్కువగా మెత్తటి పచి్చకతోనే నిండి ఉంటుంది కాబట్టి బంతి ఎక్కువ సమయంపాటు పాడు కాకుండా ఉంటుంది.
టెస్టు మ్యాచ్ సమయం?
మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 8 గంటల వరకు మ్యాచ్ సాగుతుంది. గం. 12.30కు టాస్ వేస్తారు. 3 గంటల నుంచి 3.40 వరకు 40 నిమిషాల లంచ్ విరామం ఉంటుంది. సాయంత్రం గం. 5.40 నుంచి గం.6.00 వరకు 20 నిమిషాల టీ విరామం ఇస్తారు.
మంచు ప్రభావం ఉంటుందా?
శీతాకాలంలో నిర్వహిస్తున్నారు కాబట్టి కచి్చతంగా మంచు ప్రభావం ఉంటుంది. అయితే ఎంత అనేది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఆశ్చర్యకరంగా సాయంత్రం 4 గంటలకే కోల్‌కతాలో సూర్యాస్తమయం అవుతోంది. మూడో సెషన్‌లో (6 గంటల నుంచి) మంచు ప్రభావం చూపించవచ్చు. బంతిపై పట్టు చిక్కడం కష్టం. అయితే యాంటీ డ్యూ స్ప్రే వాడతామని ‘క్యాబ్’ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment