ఉత్సాహం పెరిగింది...
భారత్, బంగ్లాదేశ్ ఏకైక టెస్టుకు ఆతిథ్యమిస్తున్న ఉప్పల్ స్టేడియంలో ప్రేక్షకుల ఉత్సాహం పెరిగింది. తొలి మూడు రోజులు స్టేడియం గ్యాలరీలన్నీ పలుచగా ఉండగా ఆదివారం సెలవురోజు కావడంతో క్రికెట్ అభిమానుల తాకిడి పెరిగింది. హెచ్‌సీఏ అధికారిక లెక్కల ప్రకారం నాలుగో రోజు ఆటను తిలకించేందుకు అత్యధికంగా 23, 377 మంది హాజరయ్యారు.
భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడేందుకు వచ్చినపుడు తమ అభిమాన క్రికెటర్లకు హైదరాబాద్ ప్రేక్షకులు జేజేలు పలికారు. క్రీజులోకి వచ్చిన ఆటగాళ్లందరూ వన్డేను తలపించేలా ధాటిగా ఆడారు. దీంతో ప్రేక్షకులకు బోర్ ఫీలింగే లేకుండా పోయింది. సోమవారం ఆటకు క్లైమాక్స్ కావడంతో నేడు ప్రేక్షకుల తాకిడి మరింత పెరిగే అవకాశముంది.
– సాక్షి, హైదరాబాద్