టీమిండియా భారీ విజయం
హైదరాబాద్: బంగ్లాదేశ్ తో ఇక్కడ ఉప్పల్ లో ని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా 208 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరిరోజు వరకూ ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ లో భారత్ జట్టు గెలుపొంది స్వదేశంలో తమకు తిరుగులేదని నిరూపించింది. ఈ రోజు ఆటలో భాగంగా రెండో సెషన్ లోపే బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఆలౌట్ చేసిన భారత్ భారీ విజయాన్ని అందుకుంది.
(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
103/3 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ మరో 147 పరుగులు మాత్రమే జోడించి ఓటమి పాలైంది. భారత్ విసిరిన 459 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 250 పరుగులకే పరిమితం కావడంతో పరాజయం తప్పలేదు. బంగ్లా ఆటగాళ్లలో సౌమ్య సర్కార్(42), మొహ్ముదుల్లా(64)లు రాణించగా, మొనిముల్ హక్(27), షకిబుల్ హసన్(22), ముష్ఫికర్ రహీమ్(23), షబ్బిర్ రెహ్మాన్(22), మెహిది హసన్ మిరాజ్(23)లు ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అశ్విన్, జడేజాలు తలో నాలుగు వికెట్లు సాధించగా, ఇషాంత్ శర్మకు రెండు వికెట్లు దక్కాయి.
భారత్ తొలి ఇన్నింగ్స్ 687/6 డిక్లేర్, రెండో ఇన్నింగ్స్ 159/4 డిక్లేర్
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 388 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 250 ఆలౌట్