ఇప్పుడే చెప్పలేను! రిటైర్మెంట్‌పై సచిన్ స్పందన | i can't take decisionon retirement :sachin | Sakshi
Sakshi News home page

ఇప్పుడే చెప్పలేను! రిటైర్మెంట్‌పై సచిన్ స్పందన

Published Tue, Sep 3 2013 2:03 AM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM

i can't take decisionon retirement :sachin

 ముంబై: దక్షిణాఫ్రికా పర్యటనకు ముందే సొంత గడ్డపై వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఖరారు కావడంతో మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్‌పై మరో సారి చర్చ ప్రారంభమైంది. ఈ సిరీస్ తర్వాతే సచిన్ వీడ్కోలు చెప్పవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై సచిన్ ఏకవాక్యంలో తన మనసులో మాట వెల్లడించాడు. ‘ప్రస్తుతానికి నేను ఈ అంశంపై స్పందించను. ఒక టెస్టు మ్యాచ్ తర్వాతే మరో టెస్టు గురించి ఆలోచిస్తా’ అని స్పష్టం చేశాడు. ఈ వాక్యంలో వేర్వేరు అర్థాలు ధ్వనిస్తున్నాయి. ముంబైలో ఆఖరి టెస్టులో భారీ సెంచరీతో వీడ్కోలు పలకాలన్న కోరిక కావచ్చు...లేదా దక్షిణాఫ్రికా బౌన్సీ వికెట్‌లపై ఆడగల సత్తా తనలో ఇంకా ఉందనీ కావచ్చు. ఈ దిశగా ఒక్కో టెస్టును ఎంచుకుంటూ కెరీర్‌ను పెంచుకునే ఆలోచనతో కూడా మాస్టర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే  2011 జనవరిలో కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన తర్వాత సచిన్ గత 38 టెస్టు ఇన్నింగ్స్‌లలో ఒక్క శతకం కూడా చేయలేదు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement