కోహ్లికైతే ఇలాగే చేస్తారా: గావస్కర్‌ | I feel sorry for Mithali Raj , says Gavaskar | Sakshi
Sakshi News home page

కోహ్లికైతే ఇలాగే చేస్తారా: గావస్కర్‌

Published Thu, Nov 29 2018 10:06 AM | Last Updated on Thu, Nov 29 2018 10:27 AM

I feel sorry for Mithali Raj , says Gavaskar - Sakshi

న్యూఢిల్లీ: తాజా వివాదం విషయంలో మిథాలీ రాజ్‌కు క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ మద్దతు పలికారు. మిథాలీని చూస్తే తనకు బాధేస్తోందని ఆయన అన్నారు. ‘మిథాలీ అడిగిన ప్రశ్న సరైందే. తాను 20 ఏళ్లు దేశం తరఫున ఆడి పరుగులు సాధించింది. రెండు సార్లు కూడా ఆమెనే ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచింది. గాయంతో ఒక మ్యాచ్‌ ఆడలేదు. తర్వాతి మ్యాచ్‌కు ఫిట్‌గా ఉన్నా తీసుకోకపోవడం ఏమిటి? నాకౌట్‌ల కోసం మీ అత్యుత్తమ ప్లేయర్‌ను కచ్చితంగా ఎంచుకోవాలి. మిథాలీ అనుభవం జట్టుకు పనికొచ్చేది. దీనినే పురుషుల క్రికెట్‌కు అన్వయించి చూడండి.

విరాట్‌ కోహ్లి గాయంతో ఒక మ్యాచ్‌ ఆడకుండా ఆ తర్వాత తిరిగొస్తే అతడిని కూడా పక్కన పెడతారా?అని సునీల్‌ గావస్కర్‌ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పొవార్‌ పాత్రపై బయటి వ్యక్తిగా తానేమీ చెప్పలేనన్న సన్నీ... అదే జట్టును కొనసాగించాలనుకున్నామని చెప్పడం ఏమాత్రం సహేతుక కారణం కాదని,  మిథాలీ స్థాయి ప్లేయర్‌ను ఎలా తప్పిస్తారని వ్యాఖ్యానించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement