ఐసీసీ మరో 'గేమ్' ప్లాన్!
ఐసీసీ మరో 'గేమ్' ప్లాన్!
Published Fri, Dec 16 2016 12:38 PM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM
దుబాయ్:అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మరో సరికొత్త వ్యూహానికి సిద్ధమైంది. ఇప్పటివరకూ టాప్-10 స్థానంలో ఉన్న క్రికెట్ జట్లే అత్యున్నత స్థాయి క్రికెట్ ఆడుతుండగా, ఆ సంఖ్యను మరింత పెంచాలని ఐసీసీ భావిస్తోంది. ఈ మేరకు ఐసీసీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్లు కార్యాచరణ రూపొందించే పనిలో పడ్డారు. టాప్ లెవెల్ క్రికెట్ అనేది15 నుంచి 16 జట్లు ఆడితే బాగుంటుందనే ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నట్లు రిచర్డ్సన్ తెలిపారు.
'ఇప్పటివరకూ టాప్ -10 జట్లు మాత్రమే అత్యున్నత స్థాయి క్రికెట్ ఆడుతున్నాయి. మరిన్ని జట్లు హైలెవెల్ క్రికెట్ ను ఆడాలంటే ఆ సంఖ్య మరింత పెరిగితేనే సాధ్యపడుతుంది. ప్రస్తుతం క్రికెట్ పై పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా మరిన్ని పోటీ జట్లు ఉండే బాగుంటుంది. ఒకవేళ నంబర్ ను పెంచితే ఆఫ్ఘానిస్తాన్, నేపాల్, మలేషియా తదితర దేశాలకు పూర్తిస్తాయిలో అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం వస్తుంది. ఎప్పుడైతే పెద్ద జట్లతో ఆయా జట్లు తలపడతాయో వారి యొక్క క్రికెట్ ను అభివృద్ధి చేసిన వారిమవుతాం'అని రిచర్డ్ సన్ తెలిపారు. దీనిలో భాగంగా ఆసియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ)అధ్యక్షుడు తిలంగా సుమతిపాలాతో కలిసి రిచర్డ్స్ సన్ సమావేశమయ్యారు.
Advertisement