భాటియాకు చోటు
న్యూఢిల్లీ: మార్చిలో జరిగే టి20 ప్రపంచకప్ టోర్నీకి భారత క్రికెట్ జట్టు ప్రాబబుల్స్‌ను బీసీసీఐ ప్రకటించింది. 30 మందితో కూడిన ఈ జాబితాలో సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ చోటు దక్కించుకోగా.... ఓపెనర్లు గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్‌లకు నిరాశే ఎదురైంది. అయితే ఢిల్లీకి చెందిన 34 ఏళ్ల ఆల్‌రౌండర్ రజత్ భాటియా పేరు కూడా ఇందులో ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడిన భాటియా 87 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 5089 పరుగులు, 107 వికెట్లు తీశాడు. హైదరాబాదీ అంబటి తిరుపతి రాయుడుకు చోటు దక్కింది. జాబితాలో ఇర్ఫాన్, యూసుఫ్ పఠాన్, చతేశ్వర్ పుజారాలకు స్థానం దక్కలేదు. గత ఐపీఎల్‌లో ఆటగాళ్లు చూపిన ప్రతిభను కూడా సెలక్టర్లు పరిగణలోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్‌లో మార్చి 16 నుంచి ఏప్రిల్ 6 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ఇదిలావుండగా మహిళల క్రికెట్ జట్టు ప్రాబబుల్స్‌లో ఎలాంటి సంచలనాలకు తావీయలేదు.
భారత జట్టు ప్రాబుబల్స్: ధోని, కోహ్లి, ధావన్, రోహిత్ శర్మ, రైనా, రహానే, రాయుడు, దినేష్ కార్తీక్, జడేజా, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, షమీ, ఇషాంత్, వినయ్ కుమార్, స్టువర్ట్ బిన్నీ, మోహిత్ శర్మ, కేదార్ జాదవ్, యువరాజ్ సింగ్, అమిత్ మిశ్రా, రజత్ భాటియా, సంజూ శామ్సన్, ఈశ్వర్ పాండే, ఉమేశ్ యాదవ్, ఉన్ముక్త్ చంద్, మన్‌దీప్ సింగ్, హర ్భజన్ సింగ్, వరణ్ ఆరోన్, నదీమ్, పార్థీవ్ పటేల్, కరణ్ శర్మ.